06-10-2025 11:50:19 AM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలో(Narayankhed area) ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మన్సూల్ పూర్ వాగు(Mansoolpur Vagu) పొంగడంతో పిట్లం-కంగ్టి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు కొట్టుకుపోవడంతో మనూర్-నారాయణ్ ఖేడ్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏఎస్ నగర్, దత్తాత్రేయ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. మున్యనాయక్ తండా, శేరితండా, వంగ్దల్ కు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో కొండాపూర్, గైరాన్ తండాకు రాకపోకలు నిలిపోయాయి.
అటు కామారెడ్డి జిల్లాలోని(Kamareddy District) పలు మండలాల్లో సోమవారం భారీ వర్షం(Heavy rain) కురుస్తోంది. పిట్లం, బాన్సువాడ, పెద్దకొడపగల్ మండలాల్లో వర్షం పడుతుంది. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ భారత వాతావరణ శాఖ (India Meteorological Department) హైదరాబాద్ కేంద్రం సోమవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, కుమురం భీమ్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.