calender_icon.png 6 October, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెర్రీవోక్స్ ఫాంహౌస్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

06-10-2025 11:16:17 AM

హైదరాబాద్: మొయినాబాద్ చెర్రీవోక్స్ ఫాంహౌస్ కేసులో(Moinabad Cherryvaux Farmhouse case) దర్యాప్తు కొనసాగుతోంది. ఆర్గనైజర్లు, డీజే ప్లేయర్లు సహా 65 మంది పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పార్టీకి 59 మంది యువతి, యువకులు పార్టీకి హాజరయ్యారు. చెర్రీవోక్స్ ఫాంహౌస్ పార్టీలో 22 మంది మైనర్లు పాల్గొన్నారు. మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇషాన్ అనే యువకుడు పార్టీ నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల కెనడా నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇషాన్ ఇన్ స్టాగ్రామ్ లో ట్రాప్ హౌస్ పేజ్ ఏర్పాటు చేశాడు. అక్టోబర్ 4న చెర్రీవోక్స్ ఫాంహౌస్ లో పార్టీ నిర్వహించాడు. సీక్రెట్ `ట్రాప్ హౌస్ పార్టీ' జరుగుతుందన్న పక్క సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిర్వాహకులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.