09-01-2026 12:04:03 AM
ఏడుగురిపై కేసు, 5 కేజీల గంజాయి స్వాధీనం
ఎస్పీ అఖిల్ వెల్లడి
ఆదిలాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం స్థానిక పోలీస్ హెడ్ క్వాటర్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇంద్రవెల్లి మండలంలోని శ్మశానవాటిక ప్రాంతం సమీపంలో మూడు ద్విచక్ర వాహనాలపై గంజా యి తరలిస్తున్నట్లు గుర్తించి, వాహనాల తనిఖీలు చేపట్టారు. బ్యాగ్లలో దాచిన మొత్తం 5.231 కిలోల ఎండిన గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు రూ.1,30,000 గా అంచనా వేయబడిందన్నారు.
ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం... బస్సీ సంతోష్, జవాడే శంకర్‌లు స్థానికంగా గంజాయి విక్రయాల ఏర్పాట్లు చేస్తూ, అవసరమైన సరఫరా కోసం ఇతరులతో సంబంధాలు కొనసాగించారన్నారు. ఈ క్రమంలో సయేద్ సబీర్ గంజాయి కొనుగోలువిక్రయాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, రవాణా సమయాలు, ప్రదేశాలను ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించాడన్నారు. షేక్ ఖాజా తన వ్యాపార పరిచయాలను ఉపయోగించి గంజాయి నిల్వలు దాచడం, విక్రయాలకు సహకరించినట్లు విచారణలో తేలిందన్నారు.
అంతర్రా ష్ట్రంగా గంజాయి సరఫరా కోసం మహారాష్ట్రకు చెందిన గిరీష్ విట్టల్, షేక్ ఇర్షాద్, షరీఫ్ లు ముందుగానే స్థానిక నిందితులతో మొబై ల్ ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరిపి, గంజాయిని తక్కువ ధరకు తీసుకువచ్చి అధిక ధరకు విక్రయించే ప్రణాళిక రూపొందించారన్నారు. నిందితుల మొబైల్ ఫోన్ల పరిశీలనలో గంజా యి కొనుగోలువిక్రయాలకు సంబంధించిన కాల్ రికార్డులు, సందేశాలు లభించడంతో పాటు, మరికొందరు వ్యక్తుల ప్రమేయంపై కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల నుండి 5 కేజీల గంజాయి, మూడు ద్విచ క్ర వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్‌ఐ సాయన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.