09-01-2026 12:04:12 AM
మంత్రి తుమ్మలను కోరిన వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నేతలు
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): రాష్ట్ర సచివాలయంలో గురువారం బొమ్మినేని రవీందర్‌రెడ్డి, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు, కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ ప్రతినిధి బృందం.. వ్యవసా య, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును, డాక్టర్ బి.గోపి, తెలంగాణ వ్యవసాయ శాఖ డైరెక్టర్, లక్ష్మీబాయి, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్‌లను వారి కార్యాలయాల్లో కలిశారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను వివరించారు.
నాలుగు సంవత్సరాల నుండి నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ పండ్ల మార్కె ట్ నిర్మాణం పూర్తిచేయాలని, ఉమ్మ డి వరంగల్ జిల్లాలో ఉత్పత్తి అవుతున్న జాతీ య, అంతర్జాతీయ గుర్తింపు కలిగిన మామిడిపండ్ల రకాల ఎగుమతుల కోసం కేటా యించిన ముసలమ్మ కుంటలోని వ్యవసా య మార్కెట్ స్థలంలో రోడ్లు, టవర్ లైట్లు, షెడ్లు, మహిళా రైతులకు మరుగుదొ డ్లు ఏర్పాటు చేయాలని కోరారు.
ఏనుమాము ల వ్యవసాయ మార్కెట్‌లోని పోలీస్ స్టేషన్ పక్కన గల మార్కెట్ లోని ఖాళీ స్థలమును కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి, ప్రభుత్వ అధికారులు త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కక్కిరాల రమేష్, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, వెల్ది సాంబయ్య, వరంగల్ ఛాంబర్ ఫ్రూట్ సెక్షన్ అధ్యక్షుడు, వెల్ది సతీష్, శ్రీధర్ పాల్గొన్నారు.