22 July, 2026 | 10:14 PM

కాంగ్రెస్ రాస్తారోకో

22-07-2026 09:08 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్టు చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బెల్లంపల్లి  మార్కెట్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ ఘటనకు వ్యతిరేకంగా, విద్యార్థులకు మద్దతుగా నిలిచినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనీ అరెస్టు చేయడం అమానుషమని కాంగ్రెస్ శ్రేణులు నినదించారు. ఈ కార్యక్రమంలో కాశి పాక రాజేష్( టీపీపీసీ ప్రధాన కార్యదర్శి), మత్తమారి సూరిబాబు( మాజీ మున్సిపల్ చైర్మన్) చిలుముల శంకర్( పిసిసి మెంబర్),రొడ్డ శారద( డిసిసి ప్రధాన కార్యదర్శి), బండి రాము తదితరులు పాల్గొన్నారు.