బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు
22-07-2026 09:06 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామ మాజీ ఎంపిటిసి కంచన్ పల్లి సంతోష్ గౌడ్ సోదరుడు మాజీ వైస్ ఎంపీపీ వెంకాగౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న కామారెడ్డి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ బాధిత కుటుంబానికి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించి ఆధైర్య పడవద్దు మనోధైర్యం ఉండి ముందుకు సాగాలని ధైర్యం నింపారు. అలాగే మెకానిక్ కాజా మొయినుద్దీన్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.






