22 July, 2026 | 10:30 PM

ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేస్తున్న మోడీ ప్రభుత్వం

22-07-2026 09:26 PM

- పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గెల్లి రవి

హుజూర్ నగర్,(విజయక్రాంతి): శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు భారతదేశం లో ప్రతి పౌరుడుకి ఉందని నేడు దేశంలో మోడీ పాలనలో ప్రజాస్వామ్య హక్కులపై దాడి జరుగుతుందని హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గెల్లి రవి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఇందిరా చౌక్ సెంటర్ నందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి మాట్లాడారు.

నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడిని నిరసిస్తూ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ ఇంటి ఎదుట నిరసన తెలుపుతుండగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేసి,ఈడ్చుకెల్లడం ప్రజాస్వామ్య హక్కుపై కేంద్ర ప్రభుత్వం దాడి చేసిందన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు,విద్యార్థులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు.మోడీ ప్రభుత్వం అక్రమంగా పోలీసుల అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు.