22 July, 2026 | 10:16 PM

వర్షపు నీటిని వలసి పట్టుకుందాం

22-07-2026 09:04 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను ఏర్పాటు వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఆయన జల్ సంచై జన్ భాగేదారి అభియాన్ 2.0 లో భాగంగా క్యాచ్ ది రెయిన్  బ్రోచర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వర్షపు నీటిని ప్రజలు ఒడిసి పట్టుకోవాలని  ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు విస్తృతంగా పెరుగుతాయని దీనిని అవగాహన చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్ బరిగే రమ్య రామచందర్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ బి శ్రీనివాస్, అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.