22 July, 2026 | 10:31 PM

రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్ ని ఖండిస్తూ నిరసన

22-07-2026 09:24 PM

గుండాల,(విజయక్రాంతి): నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష మరియు ధర్నాలో భాగంగా బాధిత విద్యార్థుల తరపున సంఘీభావం వ్యక్త పరిచిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని, ఎంపీ ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం  అప్రజాస్వామికమని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎస్కే ఖదీర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.

ఖదీర్ మాట్లాడుతూ...అసలు దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉందా లేదా అని ప్రశ్నించారు. విద్యార్థుల తరుపున నిలబడడం దేశ ద్రోహమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి యువతే రేపటి భారత దేశ భవిష్యత్తు అని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పేపర్ లీక్ చేసిన నిందితులను వెనకేసుకు రావడం మూలనా రేపటి దేశ భవిష్యత్తు చిన్నా భిన్నం అవుతుందని, నిందితులను వెంటనే శిక్షించి, దేశ భవిష్యత్ ని కాపాడాలని కోరారు. దీనికి కారణమైన సంబంధిత విద్యాశాఖ కేంద్ర మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.