11 May, 2026 | 10:13 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

ఐఎన్టీయుసి నాయకుడి పదవి విరమణ..

30-06-2025 07:30 PM

హాజరైన ఐఎన్టీయుసి నాయకులు..

కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం ఏరియాలోని పీవీకే 5 మైన్ లో, కాన్వేయర్ ఆపరేటర్ గా గత 40 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఐఎన్టీయుసి బ్రాంచ్ సెక్రటరీ బండారి సైమన్(INTUC Branch Secretary Bhandari Simon)ను వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ ఆధ్వర్యంలో ఐఎన్టీయుసి నాయకులు కార్యకర్తలు శాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గని మేనేజర్ శ్యామ్ ప్రసాద్, ఐఎన్టీయుసి సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్ హాజరయ్యారు.

ఈ సందర్బంగా అతిథి వక్తలు మాట్లాడుతూ... సైమన్  తన  సర్వీస్ లో ఎంతో క్రమ శిక్షణతో, నిబద్దతతో ఎలాంటి రిమార్కులు లేకుండా విధులు నిర్వర్తించారని, మిగతా కార్మికులు ఆదర్శనంగా తీసుకోవాలని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసి రీజినల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ బూటుక రాజేశ్వర్ రావు, చిలక రాజయ్య, సకినాల సమ్మయ్య, రామ్మోహన్ రావు, శ్రీనివాస్, రామారావు, మెంగన్ అశోక్, నవీన్, కుమ్ము సాంబయ్య, వల్లలా సాంబమూర్తి, సీతారాం, వీరన్న తదితరులు పాల్గొన్నారు.