calender_icon.png 1 July, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిషనర్ రాజేష్ కు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

30-06-2025 07:24:59 PM

ఘట్ కేసర్: ఘట్ కేసర్ మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పంజాల రాజేష్(Commissioner Panjala Rajesh)ని బీఆర్ఎస్ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, బండారు ఆంజనేయులు, కొమ్మగోని రమాదేవి, బేతాళ నర్సింగ్ రావు, జహంగీర్, కో-ఆప్షన్ సభ్యులు షౌకత్, నాయకులు ఎర్రోళ్ల సత్యనారాయణ, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.