calender_icon.png 16 May, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుడిపై విచారణ

16-05-2025 12:00:00 AM

ఇల్లెందు, మే ౧౫ :ఇల్లెందు మం డలం మర్రిగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పై గ్రామస్తుల ఇచ్చిన ఫిర్యా దుపై అధికారులు విచారణ చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు టేకుల పల్లి ఎంఈవో జగన్ బుదవారం విచారణ చేశారు.

2018 నుంచి మర్రిగూ డెం గ్రామంలో ప్రభుత్వ పా ఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రమేష్ విధులకు గౌర్హాజర వుతు న్నడని, పాఠశాల అభివృద్ధి నిధులలో అవకతవకలకు పాల్పడ్డాడని, పాఠశాలకు వచ్చి న రోజు సైతం విద్యార్థులకు పాఠాలు బో ధించడంలేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గ్రామస్థు లు కలెక్టర్, ఐటీడీఏ పీఓ, డీఈవోకి ఫి ర్యాదు చేశారు.

ఉపాధ్యాయుడు తరు చు విధులకు హజరుకాక పోవ డంతో గ్రామస్థులు తమ విద్యార్థులను ఇత ర ప్రాంతంలోని పాఠశాలలో చేరారని, ప్ర స్తుతం 5 గురు విద్యార్థులు ఉంటె వారిలో ముగ్గురే వస్తూన్నారని ఫిర్యాదులో పేర్కోన్నారు. గతం లోను రమ్పే వచ్చిన ఆరో పణలపై స్థానిక ఎంఈఓ విచారణ చేసి జిల్లా అధి కారులకు అం దించారు. ఈసారి విచారణకు వెళ్లిన అధికారిని గ్రామస్తులు నిలదీ శారు.

మేము ఫిర్యాదు చేయడం విచారణ చేయడం ఇదేనా అని ప్రశ్నించారు. అసలు పాఠశాలకు రాని ఆ ఉపాద్యాయుడు మాకొ ద్దు, సమగ్ర విచారం తో ఆయనపై చర్య తీసుకోవాలంటూ విచారణ అధికారికి తెలిపారు. ఈ విషయంపై విచారణ అధికారి టేకులపల్లి ఎంఈఓ జగన్ ను వివరణ కోరగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాను విచారణ చేస్తున్నట్లు, విచారణ నివేదికను వెల్లడించవద్దని పై అధికారులకు అందజేస్తానని వివరించారు.