calender_icon.png 16 May, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

15-05-2025 10:49:28 PM

కామారెడ్డి (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(State Government Advisor Shabbir Ali) గురువారం సాయంత్రం కామారెడ్డిలో బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. పేదలు కార్పొరేట్ వైద్యం పొందేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఉద్దేశంతో సీఎం సహాయ నిధి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.

ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, భిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, టిపిసిసి కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి, నాకు కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, మాజీ కౌన్సిలర్లు వడ్ల లక్ష్మీనారాయణ(బుజ్జి), కోయల్కర్ కన్నయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.