6 May, 2026 | 1:40 AM

దర్యాప్తు ముమ్మరం

06-05-2026 12:19 AM
  1. బీహార్ ముఠాగా అనుమానం
  2. కీలకంగా మారిన బ్యాగ్

కరీంనగర్, మే 5 (విజయక్రాంతి): కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన ఆభరణాల దు కాణం దోపిడీ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఆ చోరీ తర్వాత వచ్చిన మార్గంలోనే వారు తిరిగి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసుల దృష్టిని మళ్లించేందుకు నిందితులు సీసీ కెమెరాలున్న చోట ఒక దారిలో వెళ్లి, సీసీ కెమెరాలు లేని చోటు నుంచి మరో మార్గంలో పయనించినట్లు సమాచారం.

దొంగతనం తర్వాత జ్యోతినగర్‌లోని పార్క్ పక్క వీధి నుంచి ప్రధాన రహదారుల్లోకి వెళ్లకుండా, గల్లీ నుంచే శాతవాహన విశ్వవిద్యాలయం, మల్కాపూర్ మీదుగా చింతకుంట బైపాస్ నుంచి వెలిచాల వైపునకు వెళ్లారని, కాలువ గట్ల మీదుగా రామడుగు మండలం మోతె, రుద్రారం నుంచి మంచిర్యాల వెళ్లినట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.

బిహార్‌కు చెందిన వారిగా గుర్తించారున్

పోలీసుల విచారణలో మొత్తం ఐదుగురు ముఠా సభ్యులు బిహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో  ఒకరు కావాలనే తెలుగులో మాట్లాడారని గుర్తించారు. ముఠా సభ్యుల్లో ఇద్దరు పాత నేరస్తు లుగా వారి ఆనవాళ్లను చూసి నిర్ధారించారు. 

ఇతర రాష్ట్రాల్లోని పోలీసుల బలగాల నుంచి వచ్చిన సమాచారం ద్వారా ఇద్దరి గురించి సంబంధించి పక్కా ఆధారాలు లభించాయి. మిగిలిన ముగ్గురి సభ్యుల పేర్లను పోలీసులు గుర్తించినా కూడా ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. నిందితులకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరించేందుకు పోలీసు బృందాలు బిహార్‌కు వెళ్లాయి. దొంగలు ఇంకా తమ స్వస్థలాలకు చేరుకోలేదని తేలింది. వారు మార్గమధ్యలో ఎక్కడైనా ఆగి ఉన్నారా? లేక మరో ప్రాంతానికి వెళ్లారా? అనే విషయాన్ని నిర్ధారించడంపై పోలీసులు ప్రస్తుతం దృష్టిసారించారు. ఒక బ్యాగు:దోపిడీ ముఠా నగల షాపులో వదిలి వెల్లారు. ఆ బ్యాగు విచారణలో కీలకంగా మారినట్లు తెలిసింది. ఆ బ్యాగుపై ’ఐ లవ్ నందూర్భార్’ అని ఉండటంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మహారాష్ట్రలోని ఓ జిల్లా పేరు నం దూర్బార్. గుజరాత్‌కు సరిహద్దులో ఉం టుంది. ఈ బ్యాగులు గుజరాత్ సరిహద్దులోని ఓ ఫ్యాక్టరీలో తయారైనట్లు గుర్తించి పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేశారు. ఈ బ్యాగు అక్కడే తయారైనప్పటికీ విక్రయాలు మాత్రం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగాయని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలపడంతో కరీంనగర్‌లో దర్యాప్తు ప్రారంభించారు.

అనుమానితుల ఫోన్ నంబర్లపై విచారణ చేపట్టారు 

టవర్ సర్కిల్‌లోని ఓ బ్యాగుల దుకాణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు స్థానికంగా చర్చ జరిగింది. మొత్తం 16 బృం దాల పోలీసులు మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు వెళ్లి ముఠా గురించి ఆరా తీశా యి. ఇందులో వీరు బిహార్‌కు చెందిన వా రని నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం చోరీ జరిగిన ప్రదేశంలోని సెల్ టవర్ పరిధిలోని పలువురు అనుమానితుల ఫోన్ నంబర్ల జా బితాను రూపొందించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

ఇలా వచ్చారు. అలా వెళ్లారు...

ఉదయం 8.22 గంటలకు దోపిడీ చేసేందుకు వస్తున్న  దృశ్యాలు  సి సి కెమెరాల్లో రికార్డు అయ్యాయి.ఈ ఘటన జరిగిన ఆదివారం ఉదయం 11.12 గంటల సమయం లో దుకాణం లోపలి నుంచి బయటకు పరుగెత్తిన దొంగలు రామడుగు మండలం రుద్రారం గ్రామంలోని ఓ ఇంటి సమీపం నుంచి 11.35 గంటలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అదే ఇంటి వద్ద ఉదయం 8.22 గంటలకు కరీంనగర్ వైపునకు వస్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది.

అటవీ గ్రామాల మీదుగా...

పోలీసులు దోపిడీకి పాల్పడిన ముఠా వేటాడుతున్నారు. బీహార్, మహారాష్ట్ర, తెలంగాణల్లో ముఠా గురించి వాకబు చేస్తున్న పోలీసులు దోపిడీ చేసిన తరువాత ఏఏ రూట్లలో వెళ్లారో కూడా తెలుసుకున్నారు. ఈ క్రమంలో వీరు రామడుగు మండలం మోతె రుద్రారం, ధర్మపురి, బీర్పూర్ అటవీ గ్రామాల మీదుగా పరార్ అయ్యేందుకు ప్ర యత్నించినట్టుగా తెలుస్తోంది. అయితే ముఠా ఖచ్చితంగా బీర్పూర్, కలమడుగు ప్రాంతాల్లోనే ఉండి ఉంటుందన్న అనుమానంతో దాదాపు 200 మంది బలగాలు జగి త్యాల అటవీ ప్రాంతంలో జల్లడ పడుతున్నారు.  ఇదే ఫారెస్ట్ లో ఒక బైక్ ను పోలీసు లు స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అది ఒడిస్సా రిజిస్ట్రేషన్ నంబర్ తో ఉన్నట్టుగా సమాచారం. ఈ బైక్ దొం గలు వినియోగించేందేనా కాదా అన్న వివరాలను సేకరిస్తున్నట్టుగా సమాచారం.