హత్యకు దారితీసిన అక్రమ సంబంధం
* ప్రియుడిని గొడ్డలితో నరికి చంపిన భర్త...
ఉట్నూర్, మే 5 (విజయక్రాంతి): అక్రమ సంబంధం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారి తీసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో చోటు చేసుకుంది. నర్సాపూర్ (బి)లో తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న కంబ్లె చంద్రముని (40) అనే వ్యక్తిని భర్త అభినందన్ గొడ్డలితో నరికి చంపాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. తన భార్యతో చంద్రముని అలియాస్ మున్నా అనే వ్యక్తి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని అభినందన్ గుర్తించారు. నెల రోజుల క్రితం అభినందన్ ఈ విషయాన్ని పసికడ్డాడు.
ఇద్దరూ ఒకే చోట ఉన్న సమయంలో స్వయంగా చూసిన అభినందన్ చంద్రముని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. నెలరోజుల నుండి రెక్క నిర్వహిస్తూ.. సోమవారం రాత్రి ఇంటికి వచ్చే సమయంలో తన ఇంటి ముందర ఎవరికి తెలియకుండా ఆటోను పక్కన పెట్టారు. ఆటోలో దాక్కొని ఉన్న అభినందన్ చంద్రముని కోసం కాపు కాసాడు.
రాత్రి 10 గంటల తర్వాత చంద్రముని ఇంటికి వెళుతుండగా వెనుక నుండి గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. తీవ్ర రక్త స్రవంతో పడి ఉన్న చంద్రముని ని బంధువులు రిమ్స్ కు తరలిస్తుండగా చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. చంద్రముఖి కి భార్య వర్ష, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చంద్రముని హత్య చేసిన అభినందన్ సోమవారం రాత్రికి రాత్రి ఉట్నూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. మంగళవారం ఉట్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మడవి ప్రసాద్, ఎస్త్స్ర విజయ్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శివ పంచనామ నిర్వహించారు. చంద్రముని భార్య వర్షా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






