7 March, 2026 | 7:46 AM

ట్రేడ్ లైసెన్సులకు దరఖాస్తుల ఆహ్వానం

20-11-2025 12:00 AM

డిసెంబర్ 20 వరకు గడువు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 19 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలోని వ్యాపారులు, దుకాణదారులు, ఇతర వాణి జ్య సంస్థలకు కమిషనర్ కర్ణన్ కీలక ప్రకటన విడుదల చేశారు. 2026 సంవత్సరానికి  గాను, ట్రేడ్ లైసెన్సుల రెన్యూవల్, కొత్త లైసెన్సులు పొందడానికి బుధవారం షెడ్యూల్‌ను జారీ చేశారు. దరఖాస్తు గడువును 20 రోజులు పొడిగించినట్లు కమిషనర్ తెలిపారు.

దీని ప్రకారం, ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని డిసెంబర్ 20గా నిర్ణయించారు. డిసెంబర్ 20 తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 లోపు దరఖాస్తు చేస్తే 25% అపరాధ రుసుము, ఫిబ్రవరి 20 తర్వాత దరఖాస్తు చేస్తే 50% అపరాధ రుసుము విధించనున్నట్టు తెలిపారు.