calender_icon.png 20 November, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినరల్ మాయ

20-11-2025 12:00:00 AM

-శుద్ధి జలం.. శుద్ధ అబద్ధం!

-అడ్డగోలుగా వాటర్ ప్లాంట్ కేంద్రాల ఏర్పాటు

-నిబంధనలు గాలికి వదిలేస్తూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

-శుద్ధ జలం.. అంతా అబద్ధం

-చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

-యథేచ్ఛగా సాగుతున్న మంచి నీళ్లు 

శంకర్ పల్లి, నవంబర్ 17: శుద్ధ జలం పేరిట కొందరు వ్యాపారులు మంచి నీళ్ల వ్యాపారంతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్ల నీళ్లను సరఫరా చేస్తున్నా.. నీళ్ల వ్యాపారం జోరుగానే సాగుతోంది. వాటర్ ప్లాంట్ కేంద్రాల నిర్వాహ కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కాలంతో సంబంధం లేకుండానే నీళ్ల వ్యాపారంతో యేటా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది.  సుమారుగా 50శాతం మంది ప్రజలు మినరల్ వాటర్ డబ్బా నీళ్లనే వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది.

వేసవిలో ఈ వ్యాపారం మరింత ఊపందుకుంటుంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన మినరల్ వాటర్.. ప్రస్తుతం పల్లెలకు కూడా సరఫరా అవుతుంది. ప్రతీ గ్రామంలో ఒకటి, రెండు వాటర్ ప్లాంట్లు వెలుస్తున్నాయి. గతంలో ప్రభుత్వం ఏర్పా టు చేసిన ఆర్వో ప్లాంట్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రజలు మినరల్ వాటర్ వైపే మొగ్గు చూపుతున్నారు.

మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీళ్లు శుద్ధ జలమని అధికారులు ఎంత చెబుతున్నా.. ప్రజలు ప ట్టించుకున్నట్లే కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో అక్రమంగా మంచినీళ్ల వ్యాపారం జరుగు తున్నా.. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదు. అంతటా నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ప్లాంట్లను నడుపుతున్నా.. సంబంధిత శాఖల అధికారులు ప ట్టించుకున్న దాఖలాలే కనిపించడమే లేదు. ఏదైనా ఫిర్యాదులు వస్తే హడావుడి చేయడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం అధికారులకు అలవాటుగా మా రిందంటున్నారు. ఇంత జరుగుతున్నా.. జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నేరుగా నీటి సరఫరా...

కొంత మంది వాటర్ ప్లాంట్ నిర్వాహకులు నేరుగా నీటిని సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాటర్ ప్లాంట్ కేంద్రాలలో నీటిని శుభ్రపర్చకుండానే సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. చాలా చోట్ల శుద్ధి చేయని నీటి క్యాన్లలోనే నీళ్లను నింపుతూ ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. ఆ నీటినే మినరల్ వాటర్గా భావిస్తున్న ప్రజలు అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ప్రతీ నిత్యం ప్లాస్టిక్ డబ్బాలను శుభ్రపర్చాల్సి ఉండగా.ఏ వాటర్ ప్లాంట్ కేంద్రంలో నూ ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు.

20లీటర్ల ప్లాస్టిక్ క్యాన్ను ఆరు నెలల వరకు వినియోగిస్తే దానిని తిరిగి వాడకూడదనే నిబంధన ఉన్నప్పటికీ.. అంతటా రెండు, మూడేళ్లుగా ఒకే వాటర్ క్యాన్ను ఉపయోగిస్తూ నీటిని సరఫరా చేయ డం పరిపాటిగా మారింది. నాసిరకమైన ప్లాస్టిక్ డబ్బాలు, నొక్కులు పడి లోపలి భాగంలో నాచు, పాకురు పేరుకుపోతున్నా.. పట్టించుకోవడమే లేదని వినియోగదారులు చెబుతున్నారు. ప్లాస్టిక్ డబ్బాలు పూర్తిగా నల్లబడిపోయి అధ్వానంగా కనిపిస్తున్నా.. మార్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యే అవ కాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అడిగే వారే కరువు.

వాటర్ ప్లాంట్ నిర్వాహకులు తన ఇంటి వద్ద, కానీ పొలంలో కానీ ఒక నీటీ బావిని (అనగా బోర్ )వేయించుకో ఇష్టారాజ్యంగా నీటిని సరఫరా చేస్తున్నా.. అడిగే వారే కరువవుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. అసలు నిబంధనల ప్రకారం బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాం డర్డ్) నిర్ధేశించిన ప్రమాణాల ప్రకారమే నీటిని శుద్ధి చేయాలి. అలాగే విశాలమైన గదులతో పాటు ఏయిర్ కండిషన్ ఉన్న గదులు, ప్రయోగశాల తప్పనిసరిగా ఉండాలి. రసాయన శాస్త్రంలో గాని, మైక్రో బయాలజీ లో కనీసం డిగ్రీ పట్టా పొందిన  వారు నీటి శుభ్రతను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎంత మోతాదులో కాల్షియం, మెగ్నిషియం ఉందో? గమనిస్తూ ఉండాలి.

కానీ, ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. కేవలం పదో తరగతి ఉత్తీర్ణత కాకపోయినా కొందరు యువకులను నియ మించుకొని యథేచ్ఛగా నీటివ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అర్హత, అను భవం ఉన్న వారు ఎక్కడా కనిపించడం లేదు. అంతేకాకుండా నీటిని నింపడా నికి ముందు ప్లాస్టిక్ క్యాన్లను శుభ్రంగా కడిగి రివర్స్ ఆస్మోసిస్ వ్యవస్థ ద్వారా నీటిలో బ్యాక్టీరియాను నిర్మూలించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బయోలాజికల్ బ్యాక్టీరియా పరీక్షలు జరపాలని నిపుణులు పేర్కొంటు న్నారు. అయినా ఎక్కడా ఇలాంటి నిబంధనలు పాటించిన దాఖలాలే కపిపించడం లేదు.