28 March, 2026 | 6:23 PM

Breaking News

గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి   •   ఆశా కార్యకర్తల అరెస్టు తగదు   •   తిరుమలగిరి జడ్‌పిహెచ్‌ఎస్‌లో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎంఆర్వో   •   జాతీయస్థాయిలో జిల్లా కలెక్టర్ నిర్మల్ దక్కిన గౌరవం   •   ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్   •   వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •  

పీఎం యశస్వికి దరఖాస్తుల ఆహ్వానం

06-10-2024 12:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5(విజయక్రాంతి): పీఎం యశస్వి పథకం ద్వారా ఉపకార వేతనాల కోసం బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి  జి.ఆశన్న తెలిపారు. ఈ పథకానికి ఎంపికైన 9, 10వ తరగతి విద్యార్థులకు రూ.75వేలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ.1.25 లక్ష ఉపకారవేతనం అందిస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతంలోని వారికి రూ.2లక్షలకు మించరా దని తెలిపారు. దరఖాస్తు సమర్పణకు అక్టోబర్ 31 తుదిగడువుగా పేర్కొన్నారు.