calender_icon.png 21 September, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరుపుల సరఫరాకు టెండర్ల ఆహ్వానం

30-11-2024 06:02:21 PM

ఐటీడీఏ పీవో రాహుల్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గల గిరిజన సంక్షేమ పాఠశాలలకు, వసతి గృహాలకు అవసరమైన 16,127 పరుపులు సరఫరాకై సీల్డ్ టెండర్లు కోరుతున్నట్లు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టెండర్ నందు పాన్ కార్డు, టిన్ కార్డు నంబర్లు, బ్యాంక్ ఖాతా, అన్ని అర్హతలు కలిగిన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన వారు పాల్గొనవచ్చునని ఆయన తెలిపారు. 

ఆసక్తిగల టెండర్ దారులు ఉపసంచాలకులు (గి.సం.) శాఖ ఐటీడీఏ భద్రాచలం వారి కార్యాలయం నుండి తేదీ 30-11-24 నుండి 06-12-24, మధ్యాహ్నం మూడు గంటల వరకు టెండర్ షెడ్యూల్స్ పొందవచ్చునని, టెండర్ షెడ్యూల్ ధర రూ.2000/-ఉప సంచాలకులు (గి.సం.) శాఖ ఐటీడీఏ భద్రాచలం గారి పేరున ఎస్బిఐ భద్రాచలం నందు చెల్లుబాటు అయ్యే విధంగా డిమాండ్ డ్రాఫ్ట్ సమర్పించి పొందవచ్చునని, ధరావత్ సొమ్ము రూ.2,00,000/-డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో టెండర్ షెడ్యూల్ తో పాటుగా టెండర్ బాక్స్ నందు సమర్పించాలని ఆయన తెలిపారు. పూర్తి చేసిన టెండర్ షెడ్యూల్ ఆఖరి తేదీ 06-12-24 సాయంత్రం ఐదు గంటల లోపు ఉపసంచాలకులు, (గి. సం.) శాఖ, ఐటీడీఏ భద్రాచలం వారి కార్యాలయం టెండర్ బాక్స్ నందు సమర్పించాలని, తేదీ 07-12-24 ఉదయం 11 గంటలకు ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ భద్రాచలం సమావేశ మందిరంలో హాజరైన టెండర్లదారుల సమక్షంలో తెరిచి తుది నిర్ణయం తీసుకోబడునని, టెండర్ దారులు శాంపిల్స్ తీసుకొని రావాలని ఆయన కోరారు.