మాజీ మావోయిస్టులకు ఆహ్వానం
- రాజ్యసభ సభ్యుల ఎంపికకు అధిష్ఠానానికి 16మందితో జాబితా
- 8 మంది ఎమ్మెల్యేలపై డీసీసీ అధ్యక్షుల ఫిర్యాదు
- డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాలు విజయవంతం
- ఈ నెలఖరులోగా కార్పొరేషన్ పదవుల భర్తీ
- పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి) : లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానం పలుకుతామని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించా రు. మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను తాము వ్యతిరేకిం చామని, పాకిస్థాన్‌తో చర్చలకు ఒప్పుకున్న మోదీ మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకోలే దని ఆయన విమర్శించారు.
మావోయి స్టుల సిద్ధాంతంతో మాకు భిన్నాభిప్రాయా లు ఉన్నాయని, అయినప్పటికీ ప్రజల కోసం పోరాడిన వాళ్లపై తమకు గౌరవం ఉంటుందన్నారు. మేమయినా, మావోయిస్టులు అ యినా పేద ప్రజల కోసమే పోరాటం చేశారని తెలిపారు. డీసీసీ అధ్యక్షులకు నిర్వహిం చిన శిక్ష ణా తరగతులు విజయవంతంగా ముగిశాయని, రాహుల్‌గాంధీ హాజరై కీలక సూచనలు చేశారని తెలిపారు. కొందరు డీ సీసీ అధ్యకులు 8 మం ది ఎమ్మెల్యేలు సహకరించడం లేదని ఫిర్యాదు చేశారని, ఈ అం శంపై దృష్టి పెట్టామని తెలిపారు.
అమాయకుడైన రాహుల్ గాంధీని బీజేపీ, బీఆర్‌ఎస్ ఆడిపోసుకుంటున్నాయని మండిపడ్డారు. ఎప్ స్టీన్ ఫైల్స్‌లో అడ్డంగా దొరికిన మోదీ వ్యవహరంపై బీజేపీ, ఆరెస్సెస్ సమాధానం చెప్పాలని మహేష్‌కుమార్‌గౌడ్ డిమాండ్ చేశారు. రాజ్యసభ రేసులో 16మంది ఉన్నారని తెలిపారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ఢిల్లీకి పిలుస్తామని పార్టీ అధిష్ఠానం చెప్పిందన్నారు. అయితే ఢిల్లీకి పిలుస్తారా..? ఫోన్‌లోనే చర్చి స్తారా..? అనేది అధిష్ఠానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు.
సామాజిక వర్గాల వారీగా 16 మంది పేర్లను ఇచ్చామని, వీరిలో నలుగురు బీసీలు రాజ్యసభకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నార ని తెలిపారు. ఖాళీ అవుతున్న రెండు సీట్లు రాష్ట్రానికి ఒకటి ఇస్తారా..? రెండు ఇస్తారా..? అనేది బుధవా రం తెలుస్తుందన్నారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాజ్యసభ సీటును అడగటం లేదన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేట్ శక్తులకు రాజ్యసభ అవకాశం ఇచ్చిందని, తెలం గాణ కోసం పని చేసిన వాళ్లలో ఒకరికి కూ డా ఇవ్వలేదని మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఈ నెలాఖరులో కొన్ని కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామని తెలిపారు. కేరళ సీఎం పినరయి విజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి సమాధానం చెప్పారని ఆయన తెలిపారు.




