4 March, 2026 | 12:18 PM

శివుడికి మోదుగు పుష్పార్చన

04-03-2026 12:00 AM

మహబూబాబాద్, విజయక్రాంతి : హోళీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మ డి వరంగల్ జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాల్లో మంగళవారం తెల్లవారుజామున శివలింగాలను అభిషేకించి, మోదుగు పూల తో అ త్యంత మనోహరంగా అలంకరించా రు.

వివి ధ చోట్ల లక్ష మోదుగు పూలతో విశే ష పు ష్పార్చన చేశారు. హనుమకొండలోని సిద్దేశ్వరాలయం, గణపురం కోటగుళ్లు గణపేశ్వ రాలయం ప్రత్యేక పుష్పార్చనతో ముగ్ధ మనోహర రూపంలో స్వామి దర్శనమిచ్చా రు. అనంతరం దేవాలయాలను చంద్రగ్రహణం సందర్భంగా ద్వారబంధనం చేశారు.