14 April, 2026 | 1:40 PM

పోలీస్ స్మారక ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం

28-10-2025 09:12 PM

ఏర్గట్ల (విజయక్రాంతి): ఏర్గట్ల మండలంలోని తాళ్ళ రాంపూర్ సొసైటీ ఫంక్షన్ హాల్ లో పోలీస్ స్మారక కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి భీంగల్ సిఐ సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని ఎస్సై పడాల రాజేశ్వర్ తో కలిసి మంగళవారం క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్బంగా క్రీడకారూలను ఉద్దేశించి మాట్లాడుతూ.. యువత డ్రగ్స్,మదకద్రవ్యాలను బానిసకావొద్దని, నవ సమాజం నిర్మాణానికి యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించి దేశం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ క్రీడాలో ఆరోగ్యంతో పాటు ఐక్యతను చాటుతాయని అన్నారు. క్రీడకారులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పి క్రీడ కార్యక్రమంను విజయవంతగా నిర్వహించడానికి సహకరించలని సిఐ సూచించారు. ఈ కార్యక్రమంలో భీంగల్ సిఐ సత్యనారాయణ గౌడ్, ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్, విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ రెడ్డి, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్, రాజేందర్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.