చిన్న స్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు
- ఐదు మ్యాచ్‌లు ఆడనున్న ఆర్సీబీ
- ధృవీకరించిన ఆర్సీబీ సీఈవో
బెంగళూరు, మార్చి 3 : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. అనుమానాలకు తెరదించుతూ చిన్నస్వామి స్టేడియం ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వడం ఖరారైంది. ఈ విషయాన్ని ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మీనన్ ధ్రువీకరించారు. సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రజత్ పటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ గత ఏడాది ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఈ విజయోత్సాహం తీవ్ర విషాదాన్ని నింపింది.
తమ వెన్నంటి ఉన్న అభిమానులతో సంబరాలు చేసుకోవాలనుకున్న ఆర్సీబీ బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి ఊహించని విధంగా అభిమానులు తరలిరావ డంతో స్టేడియం బయట తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్నే కాకుండా దుమారాన్ని కూడా రేపింది. సరైన అనుమతులు తీసుకోకుండానే ర్యాలీ నిర్వహిం చారని తేలడంతో ఆర్సీబీ ప్రతినిధులను అరెస్ట్ చేశారు.
అటు ప్రభుత్వం కూడా చర్య లు తీసుకుంది. ప్రభుత్వ నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడాన్ని నిషేధించారు. అయితే ఐపీఎల్ ముంగిట ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అక్కడి ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తులు చేయడంతో ఎట్టకేలకు షరతులతో కూడిన అనుమతి లభించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ లో చిన్నస్వామి స్టేడియం ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది.
దీనిపై ఆర్సీబీ సీఈవో రాజేశ్ మీనన్ సంతోషం వ్యక్తం చేశారు. సుధీర్ఘ చర్చలు ఫలించాయని, అన్ని అనుమతులు తీసుకున్నట్టు వెల్లడించారు. ఆర్సీబీ తన హోం గ్రౌండ్ లో ఐదు మ్యాచ్‌లు ఆడనుందని, అనుమతి ఇచ్చిన కర్ణాటక ప్రభు త్వానికి, సహకరించిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బెంగ ళూరులో సజావుగా మ్యాచ్‌లు నిర్వహించేలా పోలీసులతో కలిసి ఆర్సీబీ పనిచే స్తుందని వెల్లడించారు. కాగా సీజన్‌లో మిగిలిన రెండు హోం గ్రౌండ్ మ్యాచ్‌లను ఆర్సీబీ రాయ్ పూర్‌లో ఆడనుంది.






