26 March, 2026 | 1:36 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

నేటి నుంచి ఐపీఎల్ 2025 షురూ

22-03-2025 12:26 AM
  1. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆరంభ వేడుకలు
  2. కోల్‌కతా, బెంగళూరు మధ్య తొలి మ్యాచ్
  3. మ్యాచ్‌కు వర్షం ముప్పు.!

కోల్‌కతా, మార్చి 21: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) 18వ సీజన్‌కు శనివారం తెరలేవనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెం జర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మే 25 వరకు జరగనున్న ఐపీఎల్ రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించనుం ది.

కోల్‌కతా వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి. తుఫాను ప్రభావంతో వాతావరణ నిపుణులు కోల్‌కతాకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. దీంతో శనివారం ఉద యం నుంచే కోల్‌కతాలో భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రానికి వర్షం అధికమయ్యే చాన్స్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దీంతో మ్యాచ్ రద్ద య్యే చాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు జరగనున్న ఆరంభ వేడుకలకు అంతా సిద్ధమయ్యింది. బాలీవుడ్ స్టార్లు దిశా పటానీ, గాయని శ్రేయా ఘోషల్ లైవ్ ప్రదర్శన జరగనుంది. అయితే వరుణుడి దెబ్బకు ఆరంభ వేడుకలు కూడా జరుగుతాయా? లేదా? అన్న అనుమానం ఏర్పడింది.

ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏప్రిల్ 6న కోల్‌కతా, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌ను గౌహతికి మార్చారు. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని మ్యాచ్‌కు పూర్తి స్థాయి భద్రత ఇవ్వలేమని పోలీసులు పేర్కొనడంతో మ్యాచ్ వేదికను మార్చినట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు స్నేహాశీష్ గంగూలీ వెల్లడించారు.

గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.