డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు
ముకరంపుర,(విజయక్రాంతి): భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో వేడుకను నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... అవిభాజ్య భారత్ కోసం డా. ముఖర్జీ పరితపించారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారత్‌లో అంతర్భాగంగా ఉంచడంలో ఆయన పాత్ర అత్యంత కీలకం. జమ్మూకాశ్మీర్ పూర్తిస్థాయి విలీనం కోసం ఆయన చేసిన పోరాటం, బలిదానం చిరస్మరణీయం. 2019లో ఆర్టికల్ 370, 35(ఎ)ల రద్దు ద్వారా ఆయన త్యాగానికి సరైన నివాళి అర్పించడం జరిగిందిని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పండుగ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.






