13 April, 2026 | 1:45 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు ఎంపిక

18-02-2026 07:39 PM

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోకల్ టు గ్లోబల్ అనే నినాదంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలకు సుల్తానాబాద్ స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.

టేబుల్ టెన్నిస్ బాలికల విభాగంలో ఈ వర్షిత, సిహెచ్ ఖుషి,కే మనస్విని, ఎస్ సాత్విక, బాలుర విభాగంలో బి మణికంఠ, ఎండి అష్రఫ్, ఎస్ సృజన్, ఏం సహర్ష్ ఎంపిక కాగా వాలీబాల్ బాలుర విభాగంలో ఎం అక్షిత్ కుమార్, బాలికల విభాగంలో డి ప్రియదర్శిని, కే లాస్య, ఫుట్బాల్ బాలుర విభాగంలో హార్దిక్ ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ లు బుధవారం  అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “క్రీడలతో శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని,విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో నూ రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ, శివ, సతీష్ , మమత, విద్యార్థులు పాల్గొన్నారు.