13 April, 2026 | 12:13 PM

Breaking News

వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •  

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక

18-02-2026 07:36 PM

ఐక్యమత్యంగా జీవనం సాగిద్దాం

రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు

ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు పాషా మియా

జవహర్ నగర్,(విజయక్రాంతి): విద్వేషాలను దూరం చేసి ఐకమత్యంగా జీవనం సాగిద్దామని కోవాబన్ వివాదాన్ని దుష్ప్రచారం చేయవద్దని భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు పాషామియా అన్నారు. ఇటీవల సమ్మక్క సారక్క జాతరలో చోటు చేసుకున్న కోవాబన్ వివాదాన్ని అపహస్యం చేయడాన్ని నిరసిస్తూ గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ దేవేందర్ నగర్ లో ముస్లిం కమిటీ కార్యదర్శి కాలేషా ఆధ్వర్యంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా కోవాబన్ పై రాద్దాంతం చేసి యూట్యూబ్లో మీడియాలో పలువురు అసత్యపు ప్రచారం చేసిన వారిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొట్ట చేత పట్టుకొని కర్నూలు నుండి వచ్చి సమ్మక్క సారక్క జాతరలో కోవాబన్ అమ్ముతున్న షేక్షావలి, జావేదులపై ఫుడ్ జీహది అంటూ అసత్యపు ప్రచారం చేయడం తగదని అలాంటి వారి పట్ల అసలైన మీడియా మిత్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

మతపరమైన ఆరోపణలతో వ్యాపారులను బెదిరించడం సరికాదని సదరు వ్యాపారులు దశాబ్దాల కాలంగా కోవా బన్నులను అమ్మతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారని పేర్కొన్నారు. మత ప్రాంతీయ తత్వాలకు రగల్చేలా రాజకీయం చేయొద్దని సమరస్యానికి సోదర భావానికి మారుపేరుగా ప్రతి ఒక్కరు నిరవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, అభ్యుదయ రచయిత షేక్ మీరా, ఏఐఎఫ్ టు యు అధ్యక్షుడు మల్లేష్, ఇఫ్టు జాతీయ కన్వీనర్ షేక్షావలి, పెరక సునీత, మహినుద్దీన్, వహీద్, సయ్యద్, అలీ, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.