28-06-2025 11:45:38 AM
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(US President Donald Trump) వ్యాఖలను టెహ్రాన్ ఖండించారు. ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోవాల్సిన ఇరాన్ సుప్రీం నాయకుడు సయ్యద్ అలీ ఖమేనీని(Ali Hosseini Khamenei) తానే రక్షించానని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఖమేనీ కృతజ్ఞత లేనివాడంటూ ట్రంప్ ట్రూత్ లో పోస్టు విమర్శించారు. అణు ఒప్పందానికి ఖమేనీని మర్యాదగా పిలవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఖమేనీ తనపై కోపం, విద్వేషపూరిత ప్రకటనలు చేస్తూనే ఉన్నారని ట్రంప్ తెలిపారు.
ఇరాన్ పై ఉన్న ఆంక్షలను సడలించేందుకు ప్రయత్నించారని ట్రంప్(President Donald Trump) వెల్లడించారు. ఇరాన్ వైఖరితో ఆంక్షల సడలింపు యోచన విరమించుకున్నానని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ ఖమేనీని అగౌరవపరచడాన్ని ఖండించారు. ఖమేనీ మద్దతుదారుల మనోభావాలు దెబ్బ తీయవద్దని ఆరాగ్చీ(Iranian Foreign Minister Araghchi) ఎక్స్ లో పోస్టు చేశారు. ఖమేనీని చంపుతామని అమెరికా, ఇజ్రాయెల్ బెదిరిస్తున్నాయని ఆయన వివరించారు. బెదిరింపులే ఉగ్రవాదానికి ఉదాహరణ అని ఐరాసలో ఇరాన్ ప్రతినిధి ఆరోపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇరాన్ శాశ్వత ప్రతినిధి కోరారు.