బాంబులతో ఇరాన్ ఛిన్నాభిన్నం
మునుపెన్నడూ లేని విధంగా దాడి చేస్తాం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్, జూలై 10 : బాంబుల వర్షంతో ఇరాన్ ఛిన్నాభిన్నం కానుందని, ఆ దేశంపై మునుపెన్నడూ దాడులు చేయ మని తమ సైన్యానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తనను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నుతోందని, ఇకపై ఉపేక్షించేది లేద ని హెచ్చరించారు. శుక్రవారం రాత్రి ఆయన ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తన జోలికి రావాలని చూస్తే, ఇరాన్‌కు నరకమంటే ఎంటో చూపిస్తానని ప్రతిన బూనారు. ఇరాన్ హిట్ లిస్ట్‌లో మొదటి స్థానంలో తానే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఆ దేశ నాయకత్వం తనను చంపాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోందని, తనను తుదముట్టించేందుకు తాజాగా కుట్ర పన్నినట్లు ఆరోపించారు. తన హత్యపై ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందనే వార్తలను ఆయన తోసిపుచ్చారు.






