calender_icon.png 22 June, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాకు ఇరాన్ విదేశాంగ మంత్రి వార్నింగ్

22-06-2025 01:33:58 PM

టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా దాడులకు మొదటి అధికారిక ప్రతిస్పందనగా, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి(Iranian Foreign Minister Seyed Abbas Araghchi), అమెరికా 'తీవ్ర ఉల్లంఘన' నుండి తనను తాను రక్షించుకునే హక్కు టెహ్రాన్‌కు ఉందని పేర్కొన్నారు. తమ అణు స్థావరాలపై అమెరికా దాడిని ఇరాన్ విదేశాంగ మంత్రి ఖండించారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా మాపై దాడులు చేసిందని ఇరాన్ ప్రకటించింది. తమపై అమెరికా భీకర యుద్ధాన్ని ప్రారంభించిందని ఇరాన్ విదేశాంగమంత్రి తెలిపారు.

అమెరికా చర్యతో అగ్రరాజ్యాన్ని శాశ్వత గాయం ఖాయమైందని ఇరాన్ విదేశాంగ శాఖ(Iranian Foreign Ministry) హెచ్చరించారు. అంతర్జాతీయ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టాలను అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించారు. నేరపూరిత ప్రవర్తనతో అమెరికా మా అణు స్థావరాలపై దాడులు చేసిందని చెప్పారు. అగ్రరాజ్యం నేరపూరిత చర్యలపట్ల ఐరాస సభ్యదేశాలు అప్రమత్తంగా ఉండాలని ఇరాన్ పిలుపునిచ్చింది. అణు స్థావరాలపై అమెరికా దాడి చేయడంపై అన్ని దేశాలు స్పందించాలని ఇరాన్ కోరింది. మా సార్వభౌమత్వ రక్షణ, ప్రజలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లోని ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దళాలు విజయవంతమైన దాడులు నిర్వహించాయని డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అన్నారు. అంతేకాకుండా చాలా లక్ష్యాలు మిగిలి ఉన్నాయని చెబుతూ ప్రతీకారం తీర్చుకోవద్దని ఆయన హెచ్చరిస్తున్నారు.