2 May, 2026 | 7:25 PM

Breaking News

డి.ఎస్.పి మహేందర్ రెడ్డికి ఎస్పీ అభినందనలు   •   రఘునాథ బంజరలో కొత్తగా మట్టి రోడ్డు ఏర్పాటు   •   ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ   •   అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి   •   మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •  

యుద్ధంలోకి ఇరాన్ డ్యాన్సింగ్ మిసైల్!

17-03-2026 02:12 AM
  1. అత్యధిక ఎత్తులో జిగ్‌జాగ్‌గా ఎగురుతూ లక్ష్యాన్ని ఢీకొట్టే సత్తా

యూఎస్, ఇజ్రాయెల్ స్థావరాలే లక్ష్యంగా తొసారి ప్రయోగం

టెహ్రాన్, మార్చి 16: గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఆస్తులే లక్ష్యంగా ఇరా న్ దాడులు కొనసాగిస్తోంది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వంటి దేశాలపైకి భారీగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది. తాజా గా ఇజ్రాయెల్, యూఎస్‌స్థావరాలే లక్ష్యంగా చేసిన దాడుల్లో టెహ్రాన్ అధునాతన క్షిపణులను ప్రయోగించింది.

యుద్ధంలో మొదటి సారిగా ఇరాన్ ‘సెజ్జిల్ క్షిపణి’ని ప్రయోగించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని డ్యాన్సింగ్‌మిసైల్, అషౌ రా వంటి పేర్లతో పిలుస్తారు. సుదూర ప్రాంతాల్లోని శత్రు లక్ష్యాలను ఇది సమర్థంగా ధ్వంసం చేయగలదు. ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్యాన్సింగ్ మిసైల్ రేంజ్ 2,000 కిలోమీటర్ల పైమాటే.

ఇది 700 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. అత్యధిక ఎత్తులో జిగ్‌జాగ్‌గా కదులు తూ.. అత్యంత సమర్థంగా లక్ష్యాన్ని ఢీకొట్టే సామర్థ్యం ఉండడంతో దీన్ని డ్యాన్సింగ్ మిసైల్ అని పిలుస్తారు. ఐరన్ డోమ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకునేలా దీన్ని రూపొందించారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్‌ఐ ఎస్) ప్రకారం.. ఈ క్షిపణి దాదాపు 18 మీటర్లపొడవు, 1.25మీటర్ల వ్యాసం, దీని బరువు 23,600 కిలోగ్రాములు ఉంటుంది.