2 May, 2026 | 9:05 PM

Breaking News

అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •  

కటక్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

17-03-2026 02:18 AM
  1. ఐసీయూలో 10 మంది రోగులు దుర్మరణం
  2. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిశా సీఎం
  3. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం

కటక్, మార్చి 16: ఒడిశా రాష్ట్రం లోని కటక్ ఎస్‌సీబీ మెడికల్ కాలేజీలో సోమవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐసీయూలో చికిత్స పొందుతున్న 10 మంది రోగులు మంటలు అంటుకొని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం 3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. కాలేజీ ట్రామా కేర్ యూనిట్‌లోఈ ఘోర విపత్తు జరిగింది. దీంతో ఐసీయూ వార్డు మొత్తం పొగతో నిండిపోయింది. ఐసీయూలో వెంటిలేటర్‌పై చాలా మంది రోగులు చికిత్స పొందుతున్నారు.

వీళ్లంతా అగ్నిప్రమాదంలో ఆహుతి అయ్యా రు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో సహాయక చర్యలు ఘటన స్థలానికి వచ్చి వెంటనే ప్రారంభించారు. అయితే అప్పటికే 10 మంది చనిపోయారు. వారు పదుల సంఖ్య లో రోగులను బయటకు ప్రాణాలతో కాపాడి తీసుకు రాగాలిగారు. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని పరిశీలిం చారు. క్షతగాత్రులను పరామర్శించి ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే ప్రమాదంపై కూడా విచారణకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ప్రాథమికంగా ఎయిర్ కండిషన్ సిస్టంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగటం వల్లే జరిగిందా? లేకపోతే వైద్య పరికరాల వల్ల మంటలు అంటుకుని ఉండవచ్చా? అని ఆరా తీస్తున్నారు. ఉన్నతస్థాయి దర్యాప్తునకు సీఎం ఆదేశించారు.