21 June, 2026 | 5:39 PM

విజయవంతమైన కేటీఆర్ సభ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం

21-06-2026 04:29 PM

బోథ్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమావేశం విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం అలుముకుంది. పార్టీ కార్యకర్తలకు నాయకులకు స్థానిక శాసనసభ్యులు అనిల్ జాదవ్ అండగా ఉంటూ వస్తున్నారు. అయితే శనివారం రోజున కేటీఆర్ నియోజకవర్గంలోని సిరికొండ, నేరడిగొండ మండలాలలో పర్యటించడం జరిగింది ఆయా మండలాల్లో తాంసి తలమడుగు గుడిహత్నూర్ నేరడిగొండ బజార్హత్నూర్ బోత్ సోనాల మండలాల నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు. కార్యకర్తలు కేటీఆర్ ను కలిసేందుకు ఉత్సాహం చూపడంతో తీవ్ర తొక్కి సలాట జరిగింది.. .. 

నినాదాలతో ఓరెత్తిన... 

కేటీఆర్ సమావేశ స్థలానికి చేరుకునే ముందు సీఎం కేటీఆర్ సీఎం కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి సమావేశానికి రావడంతో ఆయనను చూసేందుకు బి ఆర్ ఎస్ కార్యకర్తలు పోటీపడ్డారు. స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ పేరు చెప్పినప్పుడల్లా కార్యకర్తలు నినాదాలు చేస్తూ చప్పట్లు కొట్టారు ఏది ఏమైనా ఊహించిన దాని కంటే జనం ఎక్కువగా రావడంతో బి ఆర్ ఎస్ శ్రేణులు ఉత్సాహం గా ఉన్నారు.

సభాస్థలి నిండుగా...

స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో రెండు వేల మంది కార్యకర్తల కోసం భోజనాలు ఏర్పాటు చేశారు అయితే దాదాపు 6000 మంది కార్యకర్తలు తరలిరావడంతో భోజనం దొరకక ఇబ్బందులు పడ్డారు సమావేశానికి ఎంతమంది వస్తారని ఆ పార్టీ నాయకులు ఊహించకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని అంటున్నారు ఏది ఏమైనా టిఆర్ఎస్ సమావేశం విజయవంతంగా పూర్తి కావడంతో ఎమ్మెల్యే అనుసరవర్గం హర్షం వ్యక్తపరుస్తున్నారు