బీజేపీ ఫండ్స్‌లో గోల్‌మాల్?
09-04-2026 12:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): తెలంగాణ బీజేపీలో నిధుల గోల్‌మాల్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ హైకమాండ్ వార్డులవారీగా భారీగా నిధులను పంపినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రాకపోవడమే కాకుండా, నిధుల వినియోగంలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. వార్డులను ఏబీసీడీగా విభజించి, నిధులను పంపిణీ చేస్తే కొందరు నేతలు వాటిని పంపిణీ చేయకుండా తిన్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన జాతీయ నాయకత్వం జిల్లాలకు విచారణ బృందాలను పంపించేందుకు నిర్ణయించినట్లుగా సమాచారం.




