9 April, 2026 | 2:00 AM

పెళ్లి ముహూర్తం ముందు విషాదం!

09-04-2026 12:00 AM

యువ వ్యాపారవేత్త ఆత్మహత్య

గచ్చిబౌలిలో పరిధిలో ఘటన

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న ఇంటిలో అకస్మాత్తుగా విషాదం చోటుచేసుకుంది. గచ్చి బౌలి పరిధిలోని మైహోమ్ మంగళ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న యువ పారిశ్రా మికవేత్త మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి (30) ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 12న వివాహం జరగాల్సి ఉండగా, పెళ్లి ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను, స్నేహితులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

పోలీసుల వివరాల ప్రకారం& వివాహానికి ముందుగా విశాఖపట్నంలో డెస్టినేషన్ మ్యారేజ్ షూటింగ్ కోసం సుమారు రూ.20 లక్షలు అడ్వాన్స్ చె ల్లించినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఆర్థిక ఒత్తిడులు పెరగడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన వెంకట కృష్ణ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు తన సోదరుడికి సందేశం పంపిన అనంతరం పెయిన్కిల్లర్ మాత్రలు తీసుకుని, కత్తితో గొంతు కోసుకున్నాడు. వెంటనే అత న్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.