వంట వండాలంటే గ్యాస్ తంటాలు తప్పవా?
అయిజ మార్చి 18: ఇజ్రాయేల్, అమెరికా, ఇరాన్ దేశాల యుద్దాల పుణ్యమం టూ తెలుగు రాష్ట్రలపై వంటగ్యాస్ తీవ్రప్రబావం చూపుతున్నట్టు కనిపిస్తున్నది. అయి జ మునిసిపాలిటీలోని లక్ష్మి శ్రీనివాస్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర వంటగ్యాస్ కోసం ఉదయం 5 గంటలనుండి వరుస కడుతున్నారు. సు మారు పది రోజుల క్రింద వంటగ్యాస్ కోసం బుక్ చేస్తే ఇప్పుడు వచ్చిందని, కొందరి గ్యాస్ బుక్ చేసినా బుక్ అయినట్టుగా ఇంతవర కు ఓటీపీ నెంబర్ కూడా రాలేదని ప్రజలు మండిపడుతున్నారు.
వంటగ్యాస్ పై ఆదారపడడం వ ల్ల వంటచెరకు పూర్తిగా వాడకం లేదని,వంట గ్యా స్ కోసం ఇక్కడికోస్తే ఇంకా వారమైనా గ్యాస్ దొరికే పరిస్థితి లేదని లబ్ధిదారులు వాపోతున్నారు . ఇప్పుడు వంటచేసుకోలేక కుటుంబం పస్తులు ఉండాల్సిన దుర్భరస్థితి ఏర్పడిందని ఇప్పుడు మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కా వున జిల్లా స్థాయి అధికారులైనా స్పందించి వంటగ్యాస్ కొరత లేకుండా చూడాలని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




