19 March, 2026 | 6:49 AM

బ్రెజిల్, చిలీతో క్రిటికల్ మినరల్స్ ఒప్పందాలు

19-03-2026 01:48 AM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): అర్జెంటీనాతో లిథియం మైనింగ్‌కు సంబంధించిన ఒప్పందం పూర్తయిందని, బ్రెజిల్, చిలీ వంటి దేశాలతోనూ క్రిటికల్ మినరల్స్ ఒప్పందాలు త్వరలో పూర్తికానున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో అర్బన్ మైనింగ్ ద్వారా చాలా వర కు క్రిటికల్ మినరల్స్‌ను రీసైక్లింగ్‌తో పునద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ-వేస్ట్‌ను రీసైక్లింగ్ కేంద్రాలకు అప్పగించాలని, దీనిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని కోరా రు. క్రిటికల్ మినరల్స్‌కు సంబంధించి బుధవారం లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్న కు కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు.

క్రిటికల్ మినరల్స్ విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో 90 నుంచి 95 శాతం వరకు మనం దిగుమతులపై ఆధారపడుతున్నామని, దీన్ని తగ్గిం చేందుకు కేంద్రం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ను ప్రారంభించిందన్నారు. విదేశాల్లోని క్రిటికల్ మినరల్ బ్లాక్స్‌ను గవర్నమెం ట్ టు గవర్నమెంట్ స్థాయిలో ఒప్పందాలు చేసుకుని అక్కడి మినరల్స్‌ను భారత్‌కు తెచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు.