26-06-2025 12:00:00 AM
‘విజయక్రాంతి’ కథనంపై స్పందించిన అధికారులు
బెజ్జూర్, జూన్ 25(విజయక్రాంతి): బెజ్జూ ర్ మేజర్ గ్రామపంచాయతీ పాలనపై ఈనె ల 22న ‘విజయక్రాంతి’ దినపత్రికలో ప్రచు రించిన ‘గాడి తప్పిన పంచాయతీ పాలన’ కథనంపై అధికారులు స్పందించారు. బెజ్జూ ర్ పంచాయతీ ప్రత్యేక అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో పాటు ట్రాక్టర్ చెడిపోవ డంతో గత కొన్ని రోజులుగా చిత్త సేకరణ చేపట్టకపోవడంతో, చెత్తను సైతం గ్రామ సమీపంలోని చెరువుని డంపింగ్ యార్డ్‌గా మార్చినట్లు కథనంలో పేర్కొనడంతో అధి కారులు స్పందించారు.
పక్క పంచాయతీ అయినా సిద్ధపూర్ నుండి పంచాయతీ ట్రాక్ట ర్ తీసుకువచ్చి చెత్తను సేకరిస్తున్నారు. పారి శుద్ధ కార్మికులతో కాలనీలలో ఎప్పటిక ప్పుడు పనులు చేపడుతున్నారు. అధికారు లు స్పందించి చెత్త సేకరణ చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.