26-05-2025 12:40:16 AM
-లేకుంటే పోస్ట్ హుష్ కాకి
- హమాలీ పని కన్నా దారుణంగా సెక్యూరిటీ గార్డ్ పని
- వనపర్తి ఎంసీహెచ్‌లోదారుణం
వనపర్తి, మే 25: ఎక్కడికి వెళ్తున్నావ్‌రా... డాడీ నేను డ్యూటీకి వెళుతున్నాను అంటూ టిక్ టాక్ లా తయారు అయ్యి 100 రూపాయలతో పెట్రోల్ కొట్టించుకుని బైక్ పై రెయి మంటూ ఎం సి హెచ్ ఆసుపత్రికి చేరుకొని దసరా బుల్లోడిలా సెక్యూరిటీ డ్రెస్సులో త యారు అయ్యి డ్యూటీలో చేరిన వెంటనే సె క్యూరిటీ గార్డ్ విధులు వదిలేసి హమాలి అవతారం ఎత్తల్సిందే.
నా కుమారుడు ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ డ్యూటీ చే స్తూ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారని తల్లిదండ్రులు పలువురితో గొప్పలు చెప్పుకుంటారు. కానీ వనపర్తి జిల్లా కేంద్రం లోని మాతా శిశు సంరక్షణ కేంద్రం ( ఎం సి హెచ్ ఆసుపత్రి) లో మాత్రం విధులకు విరుద్ధంగా డ్యూటీ సెక్యూరిటీ గార్డ్ చేసేది హమాలీ పనులు అన్న చందంగా మారింది.
. వీరు చేసే పనులు చూసిన తల్లిదండ్రులు పొట్ట కూటి కోసం సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ కి వస్తే హమాలీ కన్నా అద్వానంగా తయారు అయ్యిందంటూ ఎవరికీ చెప్పుకోలేక లోలోపల మదన పడుతున్నారు.
ఈ దుర్భర సెక్యూరిటీ గార్డ్ విధులు ఆసు పత్రిలో ప్రతినిత్యం కొనసాగుతూనే ఉంది. ఈఎంసి హచ్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్య బృందం ఫోర్త్ క్లాస్ శానిటేషన్ వర్కర్లను చిన్నచూపు చిన్న చూపు చూస్తున్నారని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఉదయం 7 గంటల 30 నిమిషాలకు విధుల్లోకి చేరుకొని వారి వారి పోస్టుల్లో తొమ్మిది గంటలకు ఓపి ప్రారంభము నుంచి మ ధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల వర కు సెక్యూరిటీ గార్డ్ గా తన విధులను నిర్వహిస్తుంటారు. ప్రతి పోస్టు దగ్గర ఉన్న సె క్యూరిటీ గార్డు రోగులకు సేవలు అందించు క్రమంలో వారి అటెండర్ లతో ఎన్నో అవమానాలు చివాట్లు పడుతుంటారు.
అయినా తన విధులకు న్యాయం చేయాలని ఎనిమిది గంటలు అటెండర్ లతో చివాట్లు పడుతూ నిలబడి సేవలందిస్తుంటారు. ఇది ఇలా ఉండగా. ఓపి ప్రారంభము అయిన గంటకి కొంతమంది నరసమ్మలు అలసిపోతుంటా రు.
పోస్టు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులను పిలిచి తమకు చాయ్ చెప్పాలని ఆర్డర్లు వే స్తుంటారు. ఫోర్త్ క్లాస్ సిబ్బంది అని చిన్నచూపు చూస్తూ ఉండడం సెక్రటరీ గార్లు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదండోయ్...
హమాలీ పని చేయాల్సిందే. టిక్ టాక్ గా సెక్యూరిటీ డ్రెస్ వేసుకొని పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులకు మరో పని అంటగడతారు. మరో ఆసుపత్రి నుండి మంచాలు. ఫార్మసీ మందుల బాక్సు లు మొయ్యాలని ఆసుపత్రి వైద్య బృందం ఆర్డర్ వేస్తారు.
సెక్యూరిటీ గార్డులు మేము నీ హమాలి డ్యూటీ చేయాలా లేక సెక్యూరిటీ డ్యూటీ చేయాలా అంటూ వారి లోపల వా రే గులుక్కుంటూ చెప్పిన పనిని క్రమం తప్పకుండా చేసి పెడతారు. ఒక్కసారి అంటే ప ర్వాలేదు కానీ రోజు ఈ హమాలి పని చేస్తుండడం ఈ సెక్యూరిటీ డ్యూటీ కంటే బయట హమాలీ పని చేస్తే విలువ ఉంటుందని సె క్యూరిటీ గార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కెసిఆర్ కిట్టు ఇస్తున్న క్రమంలో ఒక్కొక్క డిసిఎంలో 200 నుండి 300 వర కు కిట్లు వచ్చేది ఆ కిట్లను ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లాలి అంటే వారే బయట నుండి హ మాలిని పిలిపించుకొని పెట్టుకునేవారు కానీ ప్రస్తుతం ఈ వైద్య బృందం మమ్మల్ని ఆడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
సుమారుగా 100 కేజీలు ఉన్న మంచాలను మూడు ఫ్లోర్ల వరకు తీసుకెళ్ల లేకపోతున్నామని సెక్యూరిటీ గార్లు వాపోతున్నారు. ఇకనుంచైనా ఉన్నత వైద్యశాఖ స్పందించి ఇలాంటి పనులు చే యించకుండా చూడాలని ఫోర్త్ క్లాస్ శానిటేషన్ సిబ్బంది కోరుతున్నారు.