calender_icon.png 15 November, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న వర్షానికే చెరువును తలపిస్తున్న రోడ్లు

15-11-2025 12:00:00 AM

  1. ఇబ్బందుల్లో ప్రయాణికులు

రెండు కోట్లు మంజూరై ఏడాది కావస్తున్న ప్రారంభం కాని రోడ్డు పనులు

నిద్రావస్థలో బండ్లగూడ మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు

బండ్లగూడ జాగిర్, మున్సిపల్ కార్పొరేషన్, నవంబర్ 14 (విజయక్రాంతి) : బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఫైబల్ సిటీ రోడ్డు పూర్తిగా అద్వానంగా తయారయింది. ఓ పక్క కంకర తేలి గుంతల మయమైన రోడ్డు.. మరోపక్క చిన్న పాటి వర్షానికి ఫైబల్ సిటీ రోడ్డు చెరువును తలపిస్తుంది.

స్నేహిత హిల్స్ గుట్టల ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వర్షం నీరు రావడంతో సాధన మెడికల్ కళాశాల సమీపంలోని ఫైబల్ సిటీ రోడ్డు పై వరద నీరు నిలిచిపోవడంతో స్నేహిత హిల్స్, ఫైబల్ సిటీ కాలనీలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు మోకాళ్ళ కంటే ఎక్కువ లోతున వర్షం నీరు వచ్చి చేరడంతో కార్లు, ద్విచక్ర వాహనదా రులు, పాదచారులు ఎక్కడ గుంత ఉందో ఏ ప్రమాదం సంభవిస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ రోడ్డుపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉన్నది.

ప్రారంభం కాని రోడ్డు పనులు..

ఫైబల్ సిటీ రోడ్డు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మున్సిపాలిటీ కి చెందిన రెండు కోట్ల రూపాయల నిధులను గత ఏడాది క్రితం కేటాయించినట్లు తెలు స్తుంది. ఈ పనులను టెండర్ ద్వారా దక్కిం చుకున్న కాంట్రాక్టర్ రోడ్డు పనులను చేపట్టడంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.. కనీసం రోడ్డుపై ఏర్పడిన గుం తలను మట్టితో పూడ్చడంలో కూడా అధికా రులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

రోడ్డు నిర్మాణం చేపట్టి ఇబ్బందులు తొలగించండి.. సిద్దు యాదవ్, స్నేహిత హిల్స్

ఫెబల్ సిటీ రోడ్డుపై పెద్ద ఎత్తున గుంత లు పడ్డాయి.. వర్షం వచ్చిందంటే వరద నీరు రోడ్డుపై చేరి ప్రయాణానికి ఇబ్బం దులు కలుగుతున్నాయి. అధికారులు స్పం దించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్నేహిత హిల్స్‌కు చెందిన సిద్దు యాదవ్ మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు..

పనులు ప్రారంభించేలా చూస్తాం

ఫెబల్ సిటీ రోడ్డు పనులకు సంబంధించి మున్సిపాలిటీ జర్నల్ ఫండ్ నుండి రెండు కోట్ల రూపాయలు కేటాయించారు. ఇటీవలే కాంట్రాక్టర్ పనిని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సోమవారం రోడ్డు లేవలింగ్ చూసుకొని బి టి రోడ్డు పనులను ప్రారంభిస్తామని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ డి ఈ ఈ యాదయ్య తెలిపారు.

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్