నితిన్ కూడా సంక్రాంతికేనా?
నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం క్రిస్టమస్ కానుకగా విడుదల కానుందంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి. క్రిస్టమస్ పండుగకు పెద్దగా సమయం లేదు. అయినా ప్రమోషన్స్ లేకపోవడంపై కాస్త విచిత్రంగా అనిపించింది. ఈ సినిమా క్రిస్టమస్‌కి రావట్లేదని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘రాబిన్ హుడ్’ సంక్రాంతి బరిలోకి దిగనుందంటూ ప్రచారం ప్రారంభమైంది. సంక్రాంతి బరిలో ఇప్పటికే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాలు ప్రచారాన్ని ప్రారంభించేశాయి. మరి ‘రాబిన్ హుడ్’ సంక్రాంతి బరిలో నిలిచి ఈ మూడు సినిమాలతో పోటీ పడగలదా? అనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమే అయితే మాత్రం వెంకీ కుడుములకు సినిమాపై నమ్మకం చాలా గట్టిగా ఉందనే భావించాలి.






