నటి సమీరారెడ్డి పుట్టినరోజు నేడు
14-12-2024 12:00 AM
నటి సమీరారెడ్డి పుట్టినరోజు నేడు. ఆమె 1981 డిసెంబర్ 14న రాజమండ్రిలో జన్మించారు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, బెంగాలీ చిత్రాల్లో సమీరా రెడ్డి నటించారు. 1996లో గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ ‘ఔరా ఆహిస్తా’ మ్యూజిక్ వీడియోలో తొలిసారి నటించింది. 2002లో ‘మైనే దిల్ తుజుకో దియా’ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. తెలుగులో ‘జై చిరంజీవ, అశోక్’ చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.






