11 July, 2026 | 11:42 PM

తేజుది బండ ప్రేమ..

14-12-2024 12:00 AM

సాయి దుర్గ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ఎస్‌డీటీ 18’. ప్రైమ్‌షో ఎంటర్ టైన్‌మెంట్  బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిై ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఐశ్వర్యలక్ష్మి, జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగ ళ్ల ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం రామ్ చరణ్ ‘కార్నేజ్’ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొని టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రా నికి మేకర్స్ ‘సంబరాల ఏటిగట్టు’ అనే టైటిల్‌ని ఖరా రు చేశారు. ఈ చిత్రం 2025, సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. “తేజు ఈరోజు ఇక్కడ ఇలా నిలిచి ఉండటానికి కారణం అభిమానుల దీవెనలే. ఇది తనకి పునర్జన్మ. ఈ జన్మ అభిమానులే ఇచ్చారు. ఆ సమయాన్ని మళ్లీ గుర్తు చేసుకోవాలని నాకు లేదు.  తేజు ప్రేమ చాలా బండ ప్రేమ. ఒక్కసారి పట్టుకుంటే ఊపిరి కూడా ఆడదు. అంత గట్టిగా ప్రేమిస్తాడు” అన్నారు. సాయి తేజ్ మాట్లాడుతూ.. “ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన మా  మావయ్యలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ అందరి ప్రేమను పొందే అదృష్టం నాకు దక్కింది” అన్నారు.