వర్కర్ టు ఓనర్ పథకం ఉన్నట్టా ?లేనట్టా ?
- సందిగ్ధంలో సిరిసిల్ల నేతన్నలు
- రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఎదురుచూపు
- వర్కర్ టు ఓనర్ పథకంపై విశ్లేషణ
రాజన్న సిరిసిల్ల,ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి):సిరిసిల్ల నేతన్నల విషయంలో ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమం కార్మికుల చేతికి అందినట్టే అంది అందకుండా పోతు న్న పరిస్థితులు. సుదీర్ఘకాలం కష్టాల మధ్య కొనసాగిన నేత కార్మికుల జీవనంలో వెలుగులో నింపాలని ఉద్దేశంతో మొదలై ప్రశ్నా ర్థకంగా మారిన వర్కర్ టు ఓనర్‘ పథకంపై విశ్లేషణ.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నేత కార్మికుల పరిస్థితి దినదిన గండం నూరేండ్ల ఆ యుషు అన్న చందంగా మారింది. ప్రభుత్వా లు వస్తున్నాయి పోతున్నాయి. అవి కార్మికుల సంక్షేమం గురించి హామీలు ఇస్తూ పో తున్నవి. సంక్షేమం మాత్రం కార్మికుల చేతికి అందని దయనీయ పరిస్థితులు.
సిరిసిల్ల నేత కార్మికుల శాశ్వత ఉపాధి కోసం..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో తరచూ వస్తున్న సంక్షోభాలు కార్మికులకు వృత్తి భద్రత లేకుం డా పోవడం నేత కార్మికులకు తీరని కష్టాలను నింపుతూ వస్తున్నాయి. నేత కార్మికుల ఉపాధి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూ పాలని ఉద్దేశ్యంతో గతంలో ప్రభుత్వాలు కా ర్మికులనే యజమానులుగా చేయాలని సంక ల్పం నుంచి వర్కర్ టు ఓనర్ పథకం ఆలోచనలు రూపు దిద్దుకున్నాయి .
బతుకమ్మ చీరల ఆర్డర్ ద్వారా కొంత ఉపాధి అందిస్తున్న కూడా శాశ్వతంగా కార్మికులకు ఉపాధి అందించే అవకాశాలను పరిశీలించిన గత ప్రభుత్వ హయాంలోని అధికారులు అప్పటి చేనేత జౌళి శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు నేతృ త్వంలో వర్కర్ టు ఓనర్’పథకం కోసం ఆలోచనలు జరిగినట్లు చెబుతుంటారు.
వర్కర్ టు ఓనర్ పథకం ఇలా..
వర్కర్ ఓనర్ పథకం మొదటి ఫేస్ లో 1104 మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరేలా ఉంటుందని ప్రచారం జరిగింది. ఇందుకోసం 88 ఎకరాల్లో 375 కోట్లతో ఉమ్మడి వర్క్ షెడ్ నిర్మాణాన్ని కూడా సిరిసిల్ల పెద్దూరు అపేరాల్ పార్కులో నిర్మాణం చేశారు. ప్రతి కార్మికునికి ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్స్ ఒక్కో షెడ్ లో నాలుగు కార్మికుల సమిష్టి ఉమ్మడి షెడ్, కోసం అప్పట్లో రూపకల్పన కూడా చేశారు ఒక్కో వర్క్ షెడ్లు నలుగురు కార్మికులకు సంబంధించిన లూ మ్స్ ఏర్పాటు చేసుకునేదా సామూహిక వ ర్క్ షెడ్లను నిర్మించాలని ఈ పథకం రూపకల్పనలో ఉన్నట్లు అప్పట్లో తెలిపారు.
మొద టి దశలో 4,416 సెమి ఆటోమేటిక్ లూమ్స్ అందించాలని ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కార్మికులు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఒక్కో యూనిట్ కు ఎనిమిది లక్షలు గా నిర్ధారించారు. కార్మికులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం 50% సబ్సిడీ, మరో 4 లక్షలు, బ్యాంకుల ద్వారా మరో 40శాతం , 3. 2 లక్షలు, కార్మికుడి వాటా కింద పది శాతం0.8 లక్షలు చెల్లించాల్సి ఉంటుందనీ అప్పట్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం పథకం గురించి కార్మికుల్లో ఎన్నో ఆశలు కల్పించింది.
అప్పట్లో రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి హోదాలో వర్క్ షెడ్లను కల్వకుంట్లతారక రామారావు పరిశీలించారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పధకం ఊసు ఎక్కడ ఎత్తలేదు. గత ప్రభు త్వం ఎక్కడ అధికారికంగా వర్కర్ టు ఓనర్ పథకంపై ఎలాంటి జీ.వో లలో పేర్కొన్న లేదంటు కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనధికారికంగా చెబుతున్నారు. ఇటు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిఆర్‌ఎస్ కూడా ఎక్కడ ఈ విషయం ప్రస్తావించకపోవడం తో వర్కర్ టు ఓనర్ పథకం అటకెక్కినట్టేనా..అన్న సందిగ్ధం నేతా కార్మికులను వెంటాడుతుంది.
ఆందోళనలు..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఉన్న సంక్షోభ పరిస్థితుల్లో గతంలో బతుకమ్మ చీరలకు సంబంధించి దాదాపు మూడు సంవత్సరాలుగా బకాయిలు పేరుకుపోయినట్లు వస్త్ర పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. ఒక దశలో వస్త్ర పరిశ్రమ మూసివేతకు గురవుతుందన్న ఆందోళనలు పరిశ్రమలో కనిపించాయి. అప్పట్లో సిరిసిల్లలో ఉపాధి కోరుతూ కార్మికులు, యజమానులు కలిసి ఉమ్మడిగా ఆందోళన చేసిన చారిత్రక సందర్భాన్ని కూడా గమనించవచ్చు.
అప్పట్లో కష్టాల్లో ఉన్న ప్రభుత్వం కూడా సిరిసిల్ల నేత కార్మికుల దయనీయ పరిస్థితులను చూసి తమకు సంబంధం లేకపోయినా బతుకమ్మ చీరల ఆర్డర్ తో సంబంధం లేకపోయినా బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. ఈ విషయంలో సహకరించిన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేక‘ వర్కర్ టు ఓనర్‘ పథకం అమలు విషయంలో సిరిసిల్ల నేత కార్మికులు తటస్థంగా ఉండిపోయారు.
సిరిసిల్ల నేత కార్మికుల పక్షాన నిలబడి సిఐటియు లాంటి కార్మిక సంఘాలు వర్కర్ టు ఓనర్ పథకం అమలు కోసం పలు ఆందోళనలు నిర్వహించాయి. అయితే ఎక్కడ ప్రధాన పార్టీలు ప్రభుత్వాన్ని అడగకపోవడంతో ఈ విషయం క్రమక్రమంగా కనుమరుగైనట్లు కనిపించింది.
చిగురిస్తున్న ఆశలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న క్రమంలో సిరిసిల్ల నేత కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రానున్న బడ్జెట్లో ప్రత్యేక నిధుల కేటాయింపులు ఉంటాయనే ఆశాభావం తో సిరిసిల్ల నేత కార్మికులు ఎదురు చూస్తున్నారు.!
ప్రస్తుతానికి అయితే‘వర్కర్ టు ఓనర్‘పథకం ఉన్నట్టా..! ఊడినట్టా.. అ న్న ప్రశ్నకు సమాధానం దొరకాలంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధుల కేటా యింపు ఏమైనా ఉంటుందా లేదా అన్నది వేచి చూడవలసి ఉన్నది.




