సమష్టిగా ఉంటూ అభివృద్ధి చేసుకుందాం
నూతన బోరు ప్రారంభించిన డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): అందరం సమిష్టిగా ఉంటూ అభివృద్ధి చేసుకుందామని మహబూబ్ నగర్ కార్పొరేషన్ డిప్యూటీ చైర్మన్ మారేపల్లి సు రేందర్ రెడ్డి అన్నారు. గురువారం మహబూ బ్ నగర్ నియోజకవర్గ 11వ డివిజన్ బండమీదిపల్లి, వడ్డేర బస్తీ లో నూతనంగా వేసిన బోర్ డిప్యూటీ మేయర్ మరేపల్లి సురేందర్రెడ్డి ప్రారంభించారు.
అనంతరం బోరు నుం చి పుష్కలంగా నీరు రావడంతో ప్రజలు ఆ నందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో 30వ కార్పొరేటర్ గిరి గౌడ్, డీలర్ శ్రీనివాసులు, బుచ్చన్న, ఆంజనేయులు, వెంకటస్వా మి, తిరుపతియ్య గౌడ్, గంగ యాదవ్, రాములు, మహేందర్, రాజేశ్, శ్రీను,రాజు, రామచందర్, ఇప్పలి రాజు, నవీన్, మహేష్ నా యక్, కాశీమ్, పెద్దలు, ముఖ్య నాయకులు, నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు




