అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) అభివృద్ధి , సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, గ్రా మాల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేయడం జరుగుతుందని పెద్దపల్లి ఎమ్మె ల్యే చింతకుంట విజయ రమణారావు అ న్నారు, గురువారం పెద్దపల్లి జిల్లా ఎలిగే డు మండలం ర్యాకల్ దేవ్ పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం 20 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు,
అనంతరం 5 లక్షల రూపాయల నిధులతో అంగన్వాడీ భవనం రినివేషన్ చేసి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్నామని అన్నారు..ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.




