26 May, 2026 | 2:43 PM

హీరోయిన్ కాదా?

27-01-2025 12:00 AM

మహేశ్ బాబు-రాజమౌళి సినిమా ‘ఎస్‌ఎస్‌ఎంబీ 28’ ఏమో కానీ రోజుకో ప్రచారం వెలుగులోకి వస్తోంది. అందులో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియక జనాలకు పిచ్చెక్కుతోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. ఆమె హైదరాబాద్‌కు రావడంతో జనాలంతా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు చూస్తే ప్రియాంక హీరోయిన్ కాదంటున్నారు.

ఒకవైపు రాజమౌళి అప్‌డేట్, దానికి మహేశ్ ఇచ్చిన రిప్లుతై అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ‘క్యాప్చర్డ్..’ అంటూ సింహాన్ని లాక్ చేసినట్టు అర్థం వచ్చేలా ఓ వీడియోను రాజమౌళి పంచుకున్నారు. అలాగే పాస్‌పోర్ట్ చూపిస్తూ రాజమౌళి చిరునవ్వు చిందించడం.. బ్యాగ్రౌండ్‌లో ‘స్పైడర్’ మ్యూజిక్ వినిపించడంతో వీడియో ఆసక్తిని రేకెత్తించింది.

దీనికి ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అంటూ మహేశ్ బదులివ్వడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇలాంటి తరుణంలో ప్రి యాంక హీరోయిన్ కాదంటూ వస్తున్న న్యూస్ ఫ్యాన్స్‌ను డైలమాలో పడేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ వేరే ఉందట. ప్రియాంక కీలక పాత్రలో నటిస్తోందట. మరి ఇదెంత వ రకూ నిజమో చూడాలి.