భూపాలపల్లిలో సింగరేణి నివాసాల సమస్యలు పరిష్కరించాలి
సింగరేణి డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 13 (విజయ క్రాంతి): భూపాలపల్లి మున్సిపాలిటీలోని సింగరేణి టి,టు రెండో రకం నివాస ప్రాంతాల్లో కార్మికులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి కోరారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
నివాస ప్రాంతాల్లో తాగునీరు, మెట్ల నిర్మాణం, మురుగునీటి వ్యవస్థ, భద్రత, ప్రహరీ గోడ వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలను పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సాగర్రెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు బడితెల సమయ్య, రత్నం అవినాష్, భాసనపల్లి కుమారస్వామి, కొండి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.






