23 June, 2026 | 11:21 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

అసభ్యకరంగా అనిపించలేదు!

19-03-2026 12:00 AM

ధ్రువ్ సర్జా హీరోగా రూపొందిన చిత్రం ‘కేడీ: ది డెవిల్’. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాట వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ పాటలో సంజయ్ దత్, నోరా నటించారు. ఇటీవల సాంగ్ విడుదల కాగా సాహిత్యం, నృత్యంపై విమర్శలు వచ్చాయి. ఈ పాటపై లోక్‌సభలో బుధవారం చర్చ జరిగింది. మరోవైపు ఈ పాట వివాదంపై బాలీవుడ్ గేయ రచయిత రకీబ్ ఆలం స్పందించారు.

దర్శకుడు ప్రేమ్ కన్నడలో రాసిన పాటను చిత్రబృందం విజ్ఞప్తి మేరకు అనువదించానని చెప్పారు. వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో కొత్త వెర్షన్ రాయమని కోరినట్లు తెలిపారు. ఇక ఇదే పాట వివాదంపై నోరా ఫతేహి కూడా స్పందించారు. ఈ సాంగ్ హిందీ వెర్షన్‌లో చోటుచేసుకున్న మార్పుల గురించి తనకు తెలియదని చెప్పారు. ఈ విషయంలో తన అనుమతి తీసుకోలేదంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

“కన్నడ వెర్షన్ సాంగ్ షూటింగ్ మూడేళ్ల క్రితం జరిగింది. పెద్ద సినిమా కావడం, పైగా సంజయ్ దత్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో అంగీకరించా. హిందీ పాట ‘ఖల్ నాయక్ హూ మే’ను రీమేక్ చేస్తున్నారనుకున్నా. అప్పుడు నాకు కన్నడ అర్థం కాదు.. కాబట్టి వారు చెప్పిన దానిపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఆ సమయంలో ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు అసభ్యకరంగా ఉన్నట్లు అనిపించలేదు” అని నోరా పేర్కొన్నారు. 

మంగ్లీ క్షమాపణలు 

‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాటను పాడిన మంగ్లీ సైతం సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. ప్రజల మనోభావా లను గౌరవిస్తూ అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి ఈ సాంగ్‌ను తొలగించినట్టు తెలిపారు. జరిగిన దానికి చింతిస్తున్నానని, అనుకోకుండా జరిగిన ఈ పొరపాటకు క్షమాపణలు తెలియజేస్తున్నానని, మరోసారి ఇలా జరగ దని హామీ ఇస్తున్నానంటూ మంగ్లీ పోస్ట్ పెట్టారు.