రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం: ఐటీ ఉద్యోగి దుర్మరణం
22-08-2026 10:12 AM
హైదరాబాద్: రాయదుర్గం పరిధిలోని ఖాజాగూడలో ఉన్న ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్(Engineering Staff College) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసుల సమాచారం ప్రకారం, ముగ్గురు వ్యక్తులు బైక్‌పై ఖాజాగూడ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా, వాహనం నడుపుతున్న వ్యక్తి నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ వాసి అబ్బాస్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.






